Home  »  TV News  »  Karthika Deepam2:జ్యోత్స్న పార్టీ ప్లాన్.. కార్తీక్ అనుమానం నిజమవుతుందా?

Updated : Apr 1, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 632 లో.. దీప దగ్గరికి పారిజాతం వచ్చి మనవరాలా అంటూ హగ్ చేసుకుంటుంది. అది చూసి మనవరాలా అని కాంచన, అనసూయ, కార్తీక్ అడుగుతాడు. తను నాకు మనవరాలు లాంటిది అని పారిజాతం కవర్ చేస్తుంది. పొద్దున్నేమో తిట్టేసి ఇప్పడేమో మనవరాలా అంటు వస్తావా అని కార్తీక్ అడుగుతాడు. నాకు జ్ఞానోదయం అయిందిరా.. నా అంతరాత్మ నన్ను తిట్టిందిరా అని పారిజాతం అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. తనని చూడగానే నా మునిమరాలు అని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది.ఈవిడేంటి తేడాగా ప్రవర్తిస్తుందని అనసూయ అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుందని కాంచన అంటుంది. అలా ఏం లేదు.. నేను బాగానే ఉన్నా కాంచన.. నువ్వు నా కూతురివి.. తను అనసూయ.. దీప నా మనవరాలు అంటూ మళ్ళీ ఆగిపోయి.. నా మనవరాలు లాంటిది అని పారిజాతం కవర్ చేస్తుంది. ఆ తర్వాత కుబేర్ ఫోటో చూసిన పారిజాతం.. చాలా గొప్ప మనసున్న మనిషి అని అంటుంది. కుబేర్ కి చిన్నపాటి గుడికట్టాలని పారిజాతం అనగానే వద్దులే అమ్మా మా వాడిని వదిలేయండి అని అనసూయ అంటుంది. ఆ తర్వాత పారిజాతాన్ని ఇంటికి పంపిస్తాడు కార్తీక్.

ఇక తను వెళ్ళాక ఏంటి బావ ఇదంతా అని కార్తీక్ ని దీప అడుగగా..‌ దాస్ మామయ్య కూతురు నువ్వే అని చెప్పా అంతే అని కార్తీక్ అంటాడు. అయ్యో పాపం అని దీప అనగానే పాపాలు చేసేవాళ్ళని పాపం అనడం మహాపాపం అని కార్తీక్ అంటాడు. నీకు ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం.. నేను ఇస్తాను కదా.. నువ్వు ఎంజాయ్ చెయ్ అని దీపతో కార్తీక్  అంటాడు. మరోవైపు సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న, శివన్నారాయణ మాట్లాడుకుంటారు. మమ్మీ క్షేమంగా ఇంటికి వచ్చిన సందర్భంగా రేపు మన ఇంట్లో పార్టీ ఇద్దామనుకున్నా.. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్నచిన్న అభిప్రాయభేదాలు తొలగిపోయి.. అందరం కలిసిపోవాలని జ్యోత్స్న చెప్తుంది. నీ ఆలోచన బాగుందని శివన్నారాయణ అంటాడు. మంచిదానివే .. తొందరగా పెళ్ళి చేసుకుంటే మేం సంతోషిస్తామని సుమిత్ర అనగానే రేపు చెప్తాను మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ తమ గదిలోకి వెళ్తారు. శివన్నారాయణ గుమ్మం దగ్గరికి వెళ్ళి పారిజాతం కోసం ఎదురుచూస్తుంటాడు. అప్పుడే ఎగురుకుంటూ వస్తుంది పారిజాతం. ఏంటి ఈ గంతులేంటి అని శివన్నారాయణ అనగానే వాకింగ్ కి వెళ్లానండి.. ఈ గల్లీ నుండి ఆ గల్లీకీ.. ఆ గల్లీ నుండి పక్క గల్లీకి వెళ్ళి వచ్చా అందుకే ఈ ఆయాసం, చెమటలు అని పారిజాతం అనగానే శివన్నారాయణ ఫోన్ లో ఒక వీడియో చూపిస్తాడు. అందులో దీప, శౌర్యలని పారిజాతం హగ్ చేసుకునేది ఉంటుంది. అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. అర్థం అయిందా అని శివన్నారాయణ అనగానే అర్థమైంది.. ఆ కార్తీక్ గాడు నేనేం చేసినా నా వెనకే ఉంటాడని అనగానే అప్పుడే కార్తీక్ వస్తాడు.‌

ఇక పారిజాతాన్ని కార్తీక్ కాసేపు ఆడుకుంటాడు. ఆ తర్వాత ఎందుకు వెళ్ళావ్ వాళ్ళింటికి అని శివన్నారాయణ అడుగుతాడు కానీ పారిజాతం కవర్ చేస్తుంది. జ్యోత్స్న వచ్చి అడుగుతుంది నా ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. రేపు ఇంట్లో పార్టీ ఉంది.. దీప తప్పకుండా రావాలని జ్యోత్స్న అనగానే తను రాదని కార్తీక్ చెప్తాడు. లేదు రావాలి.. తను నాకిప్పుడు స్పెషల్ గెస్ట్ నేను స్పెషల్ గా ఇన్వైట్ చేసానని చెప్పు బావ అని జ్యోత్స్న అనగానే కాంచనకి నేను ఫోన్ చేసి చెప్తానని శివన్నారాయణ అంటాడు. చిన్నమరదలు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టుందని కార్తీక్ అనుకుంటాడు. ఇక దీప దగ్గరికి ఎందుకు వెళ్ళావని పారిజాతాన్ని జ్యోత్స్న నిలదీస్తుంది. నా ఇష్టం అని చెప్పేసి పారిజాతం వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్, కాంచన, అనసూయ, దీప మాట్లాడుకుంటారు. మళ్ళీ మనం ఏం ముఖం పెట్టుకుని వెళ్తామని కాంచన అనగానే మీ నాన్న నీకు ఫోన్ చేసాడు కాబట్టి నువ్వు వెళ్ళాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.